Mon Dec 23 2024 07:23:49 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ లో మందేస్తే జేబు గుల్లవ్వాల్సిందే..!
గోవా అనగానే బీచ్ లో మద్యం తాగుతూ ఎంజాయ్ చేయొచ్చనుకుంటారు. చాలామంది అందుకోసమే గోవా అంటే ఆసక్తి చూపుతారు. అయితే, ఇక నుంచి గోవా బీచ్ లలో [more]
గోవా అనగానే బీచ్ లో మద్యం తాగుతూ ఎంజాయ్ చేయొచ్చనుకుంటారు. చాలామంది అందుకోసమే గోవా అంటే ఆసక్తి చూపుతారు. అయితే, ఇక నుంచి గోవా బీచ్ లలో [more]
గోవా అనగానే బీచ్ లో మద్యం తాగుతూ ఎంజాయ్ చేయొచ్చనుకుంటారు. చాలామంది అందుకోసమే గోవా అంటే ఆసక్తి చూపుతారు. అయితే, ఇక నుంచి గోవా బీచ్ లలో మందు తాగితే ఊరుకునేది లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పర్యాటక చట్టంలో మార్పులు తీసుకొస్తోంది. గోవాలోని బీచ్ లలో మద్యం తాగడాన్ని, వంట చేయడాన్ని నిషేదిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ తెలియజేశారు. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘించి బీచ్ లో మద్యం తాగినా, వంట చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, రూ.2 వేల జరిమానా విధించాలని, జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story