ఏపీలో నేటి నుంచి అన్నీ ఓపెన్
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మున్సిపాలిటి, కార్పొరేషన్ పరిధిలో మాత్రం సరి, బేసి సంఖ్య ఆధారంగా దుకాణాలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకే దుకాణాలు తెరవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. నిన్నటి వరకూ ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే నిత్యావసరవస్తువులు, మెడికల్ షాపులకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేటి నుంచి అన్ని దుకాణాలు తెరుచుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కంటెయిన్ మెంట్ ఏరియాల్లో మాత్రం దుకాణాలు తెరుచుకోవు. అక్కడ ఆంక్షలు యధాతధంగా అమలవుతాయి.