Wed Jan 15 2025 23:43:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆ టిక్కెట్ అమ్మేశారు
కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి మళ్లీ గాంధీ భవన్ కు చేరింది. టిక్కెట్లు దక్కని నేతల అనుచరులు ఇవాళ మళ్లీ గాంధీ భవన్ వద్దకు చేరుకుని ఆందోళనలకు దిగారు. యాకత్ పురా టిక్కెట్ ఆశించి భంగపడ్డ బుల్లెట్ కిషోర్ అనుచరులతో కలిసి వచ్చి ఆందోళన చేశారు. యాకత్ పురా టిక్కెట్ ను రాజేంద్ర రాజుకు అమ్మేశారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు డోర్నకల్ టిక్కెట్ ను నెహ్రూనాయక్ కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు గాంధీ భవన్ ఎక్కాడు. ఆత్మహత్యకు చేసుకుంటానని డిమాండ్ చేశారు.
Next Story