Sat Dec 21 2024 07:51:01 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప ఫ్యాన్స్ రివ్యూ.. అభిమానులు ఏమంటున్నారంటే?
ప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అల్లు అర్జున్ పుష్ప - ది రైజ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.
బన్నీ ఫ్యాన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూమెంట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అల్లు అర్జున్ పుష్ప - ది రైజ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. బెనిఫిట్ షో చూసిన బన్నీ అభిమానులంతా.. పుష్ప వన్ మ్యాన్ షో అని కితాబిస్తున్నారు. మరి పుష్ప హిట్ అయిందా ? ఎవరెవరు ఎలా చేశారు ? సినిమా బలాలు, బలహీనతలు ఏంటి ? సుకుమార్ బన్నీతో చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా ? ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారీ అంచనాలతో...
షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. సుకుమార్ ఇచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ పరిస్థితుల నడుమ పుష్పరాజ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, ఓవర్సీస్ పబ్లిక్ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వాటి ఆధారంగా చూస్తే.. పుష్ప సినిమాలో బన్నీ యాక్టింగ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ గా ఉందంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని, యాటిట్యూట్, మ్యానరిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటున్నారు. సందర్భానుసారంగా వచ్చే పోరాట సన్నివేశాలు, ఎలివేషన్స్ అదిరిపోయాయి. సినిమా చాలా బాగా వచ్చింది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి.
ఆ సన్నివేశం సూపర్బ్....
పాలు అమ్ముకునే దిగువ మధ్య తరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రశ్మిక ఒదిగి పోయింది. బందీగా ఉన్న తండ్రిని రక్షించుకోవడానికి జాలిరెడ్డి దగ్గరకు వెళ్ళే ముందు పుష్పను కలిసి, తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం మూవీకి హైలైట్. ఇక 'సామి.. నా సామి' పాటలో మాస్ స్టెప్స్ వేసి కుర్రకారు గుండెల్లో వేడి సెగలు పుట్టించింది రష్మిక. పుష్ఫకు అనుక్షణం అడ్డుపడే డీఎస్పీ గోవిందప్పగా శత్రు బాగా నటించాడు. అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉందంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్ ఘోష్, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు. ఇక అందరూ ఊహించినట్లే సమంత స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు ఇరగదీసిందట.
ఓవరాల్ గా...
ఓవరాల్‌గా చెప్పాలంటే పుష్ప మొదటి భాగానికి ఎండ్ అనేది ఇవ్వలేదని, రెండో భాగం వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని జోస్యం చెప్పారు ఆడియన్స్. అల్లు అర్జున్ అన్ని షేడ్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ బాగా కుదిరాయని అంటున్నారు. బన్నీ నటనతో పాటు ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్ కాగా, అల్లు అర్జున్- రష్మిక నడుమ చిత్రీకరించిన కొన్ని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెగెటివ్ పాయింట్స్ అని అంటున్నారు. ఊహించిన మేర హై మూమెంట్స్ కనిపించకపోవడంతో కాస్త నిరుత్సాహపడినట్లు బన్నీ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే సినిమాలో అనసూయ, సునీల్ రోల్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు నెటిజన్లు.
Next Story