ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు
ఇప్పుడు సోషల్ మీడియాలో అమెజాన్ లింకు చక్కర్లు కొడుతుంది . అమెజాన్ 30 వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతులు అంటూ ప్రచారం కొనసాగుతుంది . అమెజాన్ పేరుతో [more]
ఇప్పుడు సోషల్ మీడియాలో అమెజాన్ లింకు చక్కర్లు కొడుతుంది . అమెజాన్ 30 వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతులు అంటూ ప్రచారం కొనసాగుతుంది . అమెజాన్ పేరుతో [more]
ఇప్పుడు సోషల్ మీడియాలో అమెజాన్ లింకు చక్కర్లు కొడుతుంది . అమెజాన్ 30 వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతులు అంటూ ప్రచారం కొనసాగుతుంది . అమెజాన్ పేరుతో ఫార్వర్డ్ అవుతున్న ఈ లింకు పూర్తిగా బోగస్ అని సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. అమెజాన్ పేరుతో వస్తున్న లింక్ ను ఎట్టిపరిస్థితిలో ఓపెన్ చేయవద్దంటూ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ లింకును ఓపెన్ చేసినట్లయితే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని అధికారులు అంటున్నారు. అమెజాన్ 30 వార్షికోత్సవం పేరుతో సైబర్ నేరగాళ్లు లింకు అని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
మొబైల్ గెలుచుకోవచ్చని…..
అమెజాన్ కు చెందిన లింక్ క్లిక్ చేస్తే మొబైల్ గెలుచుకోవచ్చు. దీనికి తోడుగా పెద్దమొత్తంలో బహుమతులు గెలుచుకోవచ్చని ప్రచారం కొనసాగుతుంది. . ఇలాంటి మెసేజ్ లు వాట్సాప్ లో ఎక్కువగా ఫార్వాడ్ అవుతున్నాయి. అయితే తాజాగా అమెజాన్ “30 వ వార్షికోత్సవం సందర్భంగా” వంద మంది వినియోగదారులకు బహుమతులు ఇస్తున్నట్లు ఓ మేసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మెసేజ్ పూర్తిగా నకిలీదని ఫాక్ట్-చెకింగ్ వెబ్సైట్ తేల్చి చెప్పింది. మరోవైపు ఇది ఫేక్ అని అమెజాన్ కష్టమర్ సర్వీస్ సెంటర్ కూడా నిర్ధారించింది. . అమెజాన్ 30వ వార్షికోత్సవం వేడుక అనే పేరు మీద వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ అంతా మోసపూరితమైనది.
వ్యక్తిగత సమాచారం…..
అమెజాన్ వెబ్ సైట్ కాదని తెలిపింది. ఎవరైనా లేదా మరొకరు తమ స్నేహితులకు నకిలీ లింక్‌ను ఫార్వార్డ్ చేస్తారని మరియు ఎక్కువ మంది వినియోగదారులు లింక్‌పై క్లిక్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తుంటారు. ఈ సైట్లలో చాలా మంది వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు.. ఈ వెబ్సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తే ఆర్థిక మోసానికి దారితీస్తుంది. కాబట్టి వినియోగదారులు ఏ యాప్ లను డౌన్లోడ్ చేయవద్దని లేదా తెలియని వెబ్సైట్లలో వారి సమాచారాన్ని నమోదు చేయవద్దని సైబర్ నిపుణులు సలహా ఇస్తారు. ప్రత్యేకించి ఆన్లైన్లో వారు అందుకున్న లింక్‌పై క్లిక్ చేయద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.