Mon Dec 23 2024 09:56:15 GMT+0000 (Coordinated Universal Time)
అంబానీ మనవడి బర్త్ డే అదరహో
అంబానీ మనవడు పృథ్వీ తొలి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.పృధ్వీని దీవించేందుకు వంద మంది పండితులు హాజరు కానున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ మనవడు పృథ్వీ తొలి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పృధ్వీని దీవించేందుకు వంద మంది పండితులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరగనున్నాయి. తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా కొద్ది మందికి మాత్రమే అంబానీ ఆహ్వానం పంపారు. అతిధులుగా రణబీర్ కపూర్, ఆలియా భట్, దీపికా పడుకునే, రణవీర్ సింగ్, సచిన్ టెండుల్కర్ మరికొందరు హాజరు కానున్నారు. ముంబయి నుంచి వీరి కోసం అంబానీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.
వంటగాళ్లు థాయ్ లాండ్ నుంచి....
పృధ్వీ ఆడుకునేందుకు బొమ్మలు నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. పసందైన విందుభోజనం కోసం వంటవారిని ఇటలీ, థాయ్ లాండ్ నుంచి రప్పించారు. నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన బొమ్మలను జామ్ నగర్ లోని అనాధాశ్రమంలో పంపిణీ చేయనున్నారు. జామ్ నగర్ వాసులందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే అతిధులు ఖచ్చితంగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది.
Next Story