Tue Jan 07 2025 20:15:59 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ఓటమికి కారణం చెప్పిన అంబటి
కాంగ్రెస్ - టీడీపీ అనైతిక పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు డబ్బులకు ఆశపడి ఆయనతో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా చంద్రబాబుతో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిందని అన్నారు. చంద్రబాబుతో పొత్తు లేకుంటే కాంగ్రెస్ కి విజయావకాశాలు ఉండేవన్నారు. చంద్రబాబు, లగడపాటి కలిసి ఆడిన డ్రామాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు.
Next Story