అది వైఎస్ నిర్ణయం కాదు
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని తిరిగి పునరుద్ధించడం ఆయన నిర్ణయం కాదని, కాంగ్రెస్ నిర్ణయమని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. శాసనమండలిని రద్దు చేస్తే [more]
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని తిరిగి పునరుద్ధించడం ఆయన నిర్ణయం కాదని, కాంగ్రెస్ నిర్ణయమని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. శాసనమండలిని రద్దు చేస్తే [more]
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని తిరిగి పునరుద్ధించడం ఆయన నిర్ణయం కాదని, కాంగ్రెస్ నిర్ణయమని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. శాసనమండలిని రద్దు చేస్తే వైఎస్ ఆశయాలను వైసీపీ తూట్లు పొడుస్తుందన్న విమర్శలు అర్థరహితమన్నారు. చెన్నారెడ్డి హయాంలోనే శాసనమండలిని పునరుద్ధరించాలని కాంగ్రెస్ చర్యలు ప్రారంభించిందన్నారు. వైఎస్ హయాంలో తిరిగి ప్రారంభమయిందన్నారు. ఈ విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకి శాసనమండలిని రద్దు చేయాలన్న ఆలోచన లేదన్నారు. అందుకే మ్యానిఫేస్టోలో పెట్టలేదన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నందునే రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వరసగా తాము తెస్తున్న బిల్లులను అడ్డుకుంటున్నందునే రద్దు ఆలోచన వచ్చిందని అంబటి రాంబాబు తెలిపారు.రద్దు చేయడం మినహా మరో మార్గం లేని పరిస్థితిని టీడీపీ కల్పించిందన్నారు.