దళితుడిని తెచ్చాం…నిమ్మగడ్డ వారే కావాలా?
న్యాయకోవిదుడు కనగరాజన్ ను తాము నియమించామని, ఇప్పటికీ చంద్రబాబు నిమ్మగడ్డ వారే కావాలంటున్నారని వైసీపీ నేత అంబలి రాంబాబు అన్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు తెచ్చిన [more]
న్యాయకోవిదుడు కనగరాజన్ ను తాము నియమించామని, ఇప్పటికీ చంద్రబాబు నిమ్మగడ్డ వారే కావాలంటున్నారని వైసీపీ నేత అంబలి రాంబాబు అన్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు తెచ్చిన [more]
న్యాయకోవిదుడు కనగరాజన్ ను తాము నియమించామని, ఇప్పటికీ చంద్రబాబు నిమ్మగడ్డ వారే కావాలంటున్నారని వైసీపీ నేత అంబలి రాంబాబు అన్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు తెచ్చిన జీవోలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. తాము దళితుడైన కనగరాజ్ ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టడం నేరంగా చూస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు వంటి మేధావులు రెడ్డిని కూర్చోబెడతామని చెప్పారన్నారు. వ్యవస్థను సక్రమంగా నడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలే శాశ్వతమని చెప్పారు. తమకు ఎవరిపైనా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి పట్టిన పచ్చ చీడ అని అంబటి రాంబాబు అన్నారు. గతం చెరిపేస్తే చెరిగిపోదని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిమ్మగడ్డ వారిని వెనకేసుకు రావడం కరెక్ట్ కాదన్నారు.