Mon Dec 23 2024 13:50:09 GMT+0000 (Coordinated Universal Time)
వైట్ హౌస్ కు వివేక్ చేరతారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. డొనాల్డ్ ట్రంప్ అయితే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోం ఇప్పటికే ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక రిపబ్లిక్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడుతున్నారు. అందులో భారతీయ మూలాలనున్న నిక్కీ హేలీ ఒకరు.
భారతీయ మూలాలనున్న...
అలాగే మరో భారతీయ మూలాలనున్న యువకుడు కూడా అధ్యక్ష రేసులో ఉన్నానని చెబుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి తాను కూడా అమెరికన్ అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. వీరు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండాలంటే అంతకు ముందు వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో నిలిచి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసమే అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.
కేరళ నుంచి...
వివేక్ రామస్వామి భారత మూలాలున్న వ్యక్తి. రామస్వామి వయసు కేవలం 37 సంవత్సరాలే. రామస్వామి తల్లిదండ్రులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు. వారు అమెరికాకు వలస వచ్చి ఒహియోలోని విద్యుత్తు ప్లాంట్ లో పని చేస్తూ స్థిరపడ్డారు. రామస్వామి తాను కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో భారతీయ మూలాలనున్న వ్యక్తి అధ్యక్ష బరిలో ఉంటారని స్పష్టమయింది. రామస్వామి వివిధ పరిశ్రమలను నెలకొల్పి అమెరికాలో ప్రముఖ పేరు సంపాదించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షతో రామస్వామి గత ఏడాదే స్త్రైట్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించారు. మరి రామస్వామి ప్రైమరీ రేసులో ముందుకు వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి వుంది.
Next Story