Sat Jan 11 2025 22:55:05 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ బుష్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హర్బెర్ట్ వాకర్ బుష్(సీనియర్)(94) కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా బుష్ పనిచేశారు. శుక్రవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు బుష్ కుటుంబం ప్రకటించింది. 1989 నుంచి 1993 వరకు సీనియర్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు ఆయన రెండు పర్యాయాలు అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాము ఎంతగానో ప్రేమించే తమ తండ్రి ఇక లేరని తెలిసి తామంతా దు:ఖసాగరంలో మునిగిపోయామని ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ట్వీట్ చేశారు.
Next Story