సంచలన విషయాలు చెప్పిన అమృత...
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తను కళ్లముదే హత్య చేయడాన్ని అమృతవర్షిణి జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ప్రణయ్ హత్యతో సృహ కోల్పోయిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బెడ్ పైనే కన్నీరుమున్నీరవుతోంది. తాము ఏడవ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నామని, ఈ సంవత్సరం జనవరి 30న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ప్రేమను రెండు కుటుంబాల వారూ అంగీకరించలేదని, ఫోన్ మాట్లాడితే తన బాబాయ్ శ్రవణ్ కొట్టేవాడని వెల్లడించారు. అయినా ధైర్యం చేసి పెళ్లి చేసుకుని రక్షణ కోసం డీఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు.
విదేశాల్లో స్థిరపడదామనుకున్నాం...
పెళ్లి తర్వాత ప్రణయ్ కుటుంబసభ్యులు ఒప్పుకున్నారని చెప్పారు. ఇక్కడ ఉంటే ఏదైనా చేస్తారనే భయంతో హైదరాబాద్ లో ఉంటూ ఇటీవల మిర్యాలగూడకు రాగా తనకు థైఫాయిడ్ రావడంతో ఇక్కడే ఉండిపోయామని, అదే సమయంలో గర్భం దాల్చడంతో ఇక్కడే ఉండిపోయామని తెలిపారు. కానుపు తర్వాత విదేశాలకు వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను గర్భం దాల్చిన విషయం తండ్రికి తెలియడంతో గర్భం తీసేయాలని ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. అందుకు తాను ఒప్పుకోలేదని, ప్రణయ్ హత్యను తన తండ్రి, బాబాయ్ చేయించారని ఆరోపించారు. ప్రణయ్ కు గుర్తుకు తన కడుపులోని బిడ్డను చూసుకుంటానని కన్నీరుమున్నీరవుతున్నారు.