వైవాహిక జీవితానికి అడ్డువస్తుందని….?
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగుచూసింది తన వైవాహిక జీవితానికి అడ్డం వస్తున్నారు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న యువతిని అతి కిరాతకంగా చంపిన వైనం ఇది [more]
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగుచూసింది తన వైవాహిక జీవితానికి అడ్డం వస్తున్నారు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న యువతిని అతి కిరాతకంగా చంపిన వైనం ఇది [more]
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగుచూసింది తన వైవాహిక జీవితానికి అడ్డం వస్తున్నారు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న యువతిని అతి కిరాతకంగా చంపిన వైనం ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటన పై పోలీసులు విచారణ కొనసాగుతోంది. రాయదుర్గం పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్య జరిగింది. తన వైవాహిక జీవితానికి అడ్డు వస్తుందనే కోపంతో భర్త రెండో భార్యను మొదటి భార్య జానకి చంపేసింది. మాట్లాడుకుందామని ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి కిరాతకంగా హత్య చేసింది. దీనికి తనకు వరుసకు సోదరుడైన మరొక యువకుని సహకారాన్ని మొదటి భార్య తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పొచమ్మ బస్తి లో నివాసం ఉంటున్న భాస్కర్ ఈవెంట్ మ్యానేజ్ మెంట్ చేస్తుంటాడు. కుటుంబ విషయాలు మాట్లాడాలంటూ భర్త ఇంట్లో లేని సమయం లో రెండో భార్య స్రవంతిని మొదటి భార్య జానకి ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన తర్వాత స్రవంతికి మత్తు మందు వచ్చింది. ఇంటికి వచ్చిన స్రవంతిని తమ్ముడు వరసైన గుండా లక్ష్మి నారాయణతో కలసి మెడకు చున్నీ బిగించి దారణంగా హత్య చేసింది. భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .హత్యకు కారణమైన నిందితులు జానకి, లక్ష్మినారాయణ లను అరేస్టు చేసి రిమాండ్ కు పంపించారు.