Tue Nov 05 2024 19:32:29 GMT+0000 (Coordinated Universal Time)
మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం.. ఆనంద్ మహీంద్రా అసహనం
రైతు.. తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుమకూరు మహీంద్రా షోరూమ్ కు వచ్చాడు. రైతును చూసిన..
మహీంద్రా షోరూమ్ లో ఓ రైతుకు అవమానం జరిగింది. నెటిజన్ల ద్వారా ఆ విషయం ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లగా.. ఆయన అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కెంపెగౌడకు చెందిన ఓ రైతు.. తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుమకూరు మహీంద్రా షోరూమ్ కు వచ్చాడు. రైతును చూసిన.. సేల్స్ మన్ ఏం కావాలని అడుగగా.. బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వచ్చామని తెలిపాడు. దాంతో సేల్స్ మన్ "నీ దగ్గర రూ.10 కూడా ఉండవు.. రూ.10 లక్షల కారు కొంటావా ?" అని అవమానించాడు.
Also Read : ఆర్జీవీ "కొండా" ట్రైలర్ విడుదల
సేల్స్ మన్ అవమానంతో అహం దెబ్బతిన్న రైతు.. అరగంటలో రూ.10 లక్షలు తీసుకొస్తా అని సవాల్ చేసి.. అన్నట్లుగానే తీసుకొచ్చాడు. కానీ.. అప్పటికప్పుడు పికప్ ట్రక్ ను డెలివరీ ఇవ్వలేమని సేల్స్ మన్ చెప్పడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చాలామంది ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. "మా కమ్యూనిటీలోని వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పనిచేయడమే మహీంద్ర సంస్థ ప్రధాన విధానం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడడం మా ప్రధాన విలువ. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తెలిస్తే అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం" అని ట్వీట్ చేశారు.
Next Story