వెర్రి వేయి తలలు వేయడమంటే ఇదే!
పిచ్చి పీక్స్ కి చేరిందని ఈ మధ్య ఓ మాట బాగా ప్రచర్మలోకి వచ్చింది. ఆంధ్ర పార్టీలకు ఇది బాగా వర్తిస్తుంది. తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర్నుంచి... ఆంధ్రలో రాజకీయ పార్టీలు.. వాటి అభిమానుల ఓవర్ యాక్షన్‌కి అంతు లేకుండా పోతోంది. తెలంగాణలో పార్టీలకు తామే పితామహులం అన్నట్లు... అక్కడి జనాల తలరాతను తామే నిర్ణయిస్తున్నట్లు ఇక్కడి పార్టీలు బిల్డప్‌లు ఇస్తున్నాయి. అదంతా వట్టిదే అని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
తెలంగాణ సీఎం.. ఆంధ్ర చేతిలో..?

ఇంత జరిగినా.. టీవీల్లో, సోషల్ మీడియాలో ఆంధ్ర పార్టీల హడావుడి తగ్గడం లేదు. చంద్రబాబు దయవల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం అభిమానులు చొక్కాలు చించుకుంటున్నారు. సీఎం రేసులో ఉన్న మరో నేత భట్టి విక్రమార్కకు జగన్ ఆశీస్సులు ఉన్నాయని వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో ఎవరు సీఎం అయినా ఆంధ్రకు నష్టమూ లేదు, ప్రయోజనమూ ఉండదు. సొంత రాష్ట్ర ప్రయోజనాలను కాదనుకుని, సీమాంధ్రకు మేలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా, ఆ అవకాశాన్ని అంది పుచ్చుకుని, కాంగ్రెస్‌ను చీల్లి చెండాడటానికి భారాస సిద్ధంగా ఉంది. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి, పాలక పార్టీని ఇరుకున పెడుతుంది.
తెలంగాణలో సీఎం ఎవరవుతారనే విషయం అక్కడి ఓటర్ల చేతిలో లేదు. అంతా కాంగ్రెస్ అధిష్టానం మహిమ. తరాలు మారినా సీల్డ్ కవర్ సంస్కృతి ఆ పార్టీలో నడుస్తూనే ఉంది. మధ్యప్రదేశ్‌లో సచిన్ పైలట్ లాంటి ఓ యువ నాయకుడిని కోల్పోయినా, జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తి వల్ల రాజస్థాన్‌ను ‘చే’జార్చుకున్నా... జగన్మోహన్రెడ్డిని కెలికి.. ఆంధ్రలో నామరూపాల్లేకుండా పోయినా... కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. బుద్ధుంటే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? తెలంగాణ ఓటర్లంతా తమ కొత్త సీఎం కోసం ఎదురు చూస్తుంటే హస్తం పార్టీ సీనియర్లంతా ఢల్లీలో కొట్టుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికలను అడ్డం పెట్టుకుని ‘ఆత్మస్తుతి, పరనింద’ ఆంధ్రలో పీక్స్‌కి చేరుకున్నాయి. కాంగ్రెస్ విజయానికి చంద్రబాబే కారకుడంటూ ఎల్లోమీడియా ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే, వైకాపా అనుకూల మీడియా ‘చంద్రబాబుకు అంతలేదం’టూ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఎవరికో పుట్టిన బిడ్డకు తాము తండ్రులం అని చెప్పుకుంటున్న ఆంధ్ర పార్టీలను చూస్తుంటే జాలేస్తోంది. ఏతావాతా తేలిందేంటంటే... తెలంగాణ సీఎం ఎంపిక... జగన్, చంద్రబాబు చేతుల్లో లేదు. అంతా సోనియా దయ, రాహుల్ మహిమ. ఖర్గేలు, శివకుమార్‌లు, ఠాక్రేలు... అంతా భ్రమ.