శీతాకాలంలో వణుకు ఎవరికి?
డిసెంబరు 9 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం పది రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. డిసెంబరు 9వ తేదీన [more]
డిసెంబరు 9 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం పది రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. డిసెంబరు 9వ తేదీన [more]
డిసెంబరు 9 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం పది రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. డిసెంబరు 9వ తేదీన జరిగే బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో ఎన్ని పనిదినాలు ఉండాల్సిందీ నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, మద్యపాన నిషేధం, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం వంటి అంశాలు శీతాకాల సమావేశాల్లో వేడిపుట్టించనున్నాయి. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవిల పై ఇప్పటికే వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. దీంతో శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.