Andhra : ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మొత్తం వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మొత్తం వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మొత్తం వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 18, 19, తేదీతో పాటు 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగనున్నాయని తెలిసింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాలని భావిస్తుంది. టీటీడీకి సంబంధించిన కొన్ని బిల్లులను ఈ సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది.
ఛైర్మన్ ఎన్నిక?
ఈ సమావేశాల్లోనే శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. కొత్తగా మరో ముగ్గురు సభ్యులు కూడా సభకు వస్తుండటంతో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది.