Sun Nov 24 2024 23:00:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వెనక్కు తగ్గేట్లు లేడు... వాళ్లు లొంగేట్లు లేరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో వెనక్కు తగ్గేటట్లు కన్పించడం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో వెనక్కు తగ్గేటట్లు కన్పించడం లేదు. పీఆర్సీ పై ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయినా ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు సిద్ధమయింది. ఈ మేరకు ప్రభుత్వం ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన స్కేల్స్ ప్రకారం ఈ నెల జీతాల చెల్లింపులు జరిగేలా మార్పులు చేయాలని సూచించింది.
ఈ నెల జీతం...
జనవరి నెల జీతం ఫిబ్రవరిలో వస్తుంది. అంటే జీతాల చెల్లింపునకు ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ ను సిద్ధం చేస్తుంది. దీని ప్రకారమే వచ్చే నెలలో ప్రభుత్వోద్యోగులకు జీతాలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఇద్దరూ తగ్గేదేలే.....
దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గే అవకాశం కన్పించడం లేదు. మరో వైపు ఉద్యోగులు మాత్రం ఫిట్ మెంట్, పీఆర్సీ, హెచ్ఆర్ఏ విషయంలో తగ్గేదేలేదంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించే అవకాశాలున్నాయి. అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ వ్యవహారం ఎటువైపు వెళుతుందోనన్న ఆసక్తి నెలకొంది
Next Story