Mon Nov 25 2024 18:52:44 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో అంతా సిద్ధం.. వెళ్లేదెప్పడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వారానికి రెండు రోజుల పాటు ఆయన విశాఖలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస చేసేందుకు పోర్ట్ గెస్ట్‌హౌస్ ను తీర్చి దిద్దుతున్నారు. సీఎం నివాసం కోసం రిషికొండలో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అది పూర్తయ్యే వరకూ పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటారని అధికార వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి.
పోర్ట్ గెస్ట్ హౌస్ నుంచి...
మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి ఆయన విశాఖ నుంచి పరిపాలన సాగించే వీలుంది. తొలుత అక్కడి నుంచే పరిపాలన అనుకున్నప్పటికీ కేవలం రెండు రోజుల మాత్రమే పాలన కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి సోమ, మంగళవారం విశాఖలో ఉంటారు. బుధవారం పల్లె నిద్రకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతానికి వెళతారు. అక్కడే బుధవారం రాత్రిని నిద్రించిన అనంతరం గురువారం విశాఖలో బస చేసి రాత్రికి అమరావతికి చేరుకుంటారు. శుక్ర, శని, ఆదివారాలు అమరావతిలోనే జగన్ ఉంటారు.
సుప్రీం తీర్పు తర్వాత...
సుప్రీంకోర్టులో మూడు రాజధానుల అంశం పెండింగ్ లో ఉన్నందున జగన్ ప్రస్తుతానికి రెండు రోజులు మాత్రమే విశాఖలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేస్తున్నారు. సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చిన వెంటనే పూర్తి స్థాయి పరిపాలనను విశాఖ నుంచి చేపట్టాలని భావిస్తున్నారు. ఉగాదికి గాని, ఏప్రిల్ నెలలో గాని విశాఖ నుంచి జగన్ పాలనను కొనసాగించే వీలుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమైన అధికారులకు కూడా కార్యాలయం, బస ఏర్పాట్లను చూస్తున్నారు. పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ వెళ్లకపోయినా కొంత కాలం రెండు రోజుల పాటు పాలనను వైఎస్ జగన్ విశాఖ నుంచే కొనసాగించే వీలుంది
Next Story