Mon Dec 23 2024 07:48:19 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వచ్చేసింది. వచ్చే నెల [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వచ్చేసింది. వచ్చే నెల [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వచ్చేసింది. వచ్చే నెల 17న తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31వ తేదీకి పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించి వారి చేత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కేవలం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉంది. దీంతో ఏప్రిల్ 17వ తేదీ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story