Wed Dec 25 2024 02:15:37 GMT+0000 (Coordinated Universal Time)
లాగే కొద్దీ తెగేది ఎవరికి...? నష్టం వారికేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరిని చూస్తుంటే పీఆర్సీ విషయంలో ఇప్పట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించడం లేదు.
ప్రభుత్వోద్యోగులంటే లంచావతారులన్న మార్క్ పడిపోయింది. నీతిమంతులు కొందరున్నా ఎక్కువ శాతం మంది అవినీతిపరులన్నది జనాభిప్రాయం. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులపై ఇదే ఒపీనియన్. అయితే వారి డిమాండ్లను ప్రభుత్వంతో సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వానికి వారి అవసరం ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వోద్యోగుల అవసరం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.
పీఆర్సీ విషయంలో....
ప్రభుత్వం వైఖరిని చూస్తుంటే పీఆర్సీ విషయంలో ఇప్పట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించడం లేదు. సమస్యను నాన్చి నాన్చి పెడితే ఉద్యోగులు విసిిగిపోయి దారికి వస్తారన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ప్రభుత్వం ఫిట్ మెంట్ ను 27 శాతానికి మించి ఇవ్వలేదు. ఇది ప్రభుత్వంలోనే పెద్దలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రస్తతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితికి 27 శాతం కూడా ఎక్కువేనని ముఖ్యమంత్రి జగన్ సయితం అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఫిట్ మెంట్ విషయంలో....
అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు 39 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కేవలం పీఆర్సీతో మాత్రమే కాకుండా 70 వరకూ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాల చేత ఆందోళనలను విరమింప చేయడంలో ప్రభుత్వ వర్గాలు సక్సెస్ అయినట్లే చెప్పాలి. వారు కూడా తాత్కాలికంగా విరమిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైఖరిని చూసి మరోసారి ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్నట్లే కనిపిస్తుంది.
సమ్మెకు వెళితే....
ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లాలని భావిస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రజల్లో వారిపై వ్యతిరేకత రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు. అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రజల నుంచి వారిపైనే తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో సమ్మెకు దిగితే వారికే నష్టమని ప్రభుత్వ పెద్దలు ఒక ప్లాన్ ప్రకారం దీనిని జాప్యం చేస్తున్నారనిపిస్తుంది. ఏది జరిగినా ఇప్పుడు ఆందోళనకు దిగితే అది ఉద్యోగులకే నష్టం.
Next Story