Mon Dec 23 2024 17:20:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణను వెనక్కు నెట్టేసిన ఏపీ
ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఎంతగా అంటే ఆదాయం అధికంగా ఉన్న తెలంగాణ ను మించి
ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఎంతగా అంటే ఆదాయం అధికంగా ఉన్న తెలంగాణ ను మించి. ఊహించని విషయమే. లెక్కలు పక్కాగా ఉన్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏపీ ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణను మించి రాష్ట్ర జీడీపీ తెలంగాణ జీడీపీని దాటేసింది. ఇది ఎవరో చెప్పిన గణాంకాలు కాదు. స్వయంగా రిజర్వ్‌బ్యాంకు విడుదల చేసిన లెక్కలు.
వార్షిక వృద్ధి రేటు...
ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి సెప్టంబరు 15వ తేదీ నాటికి 10,85,625 కోట్లు కాగా, తెలంగాణ జీఎస్డీపీ 10,41,617 కోట్లు. అంటే తెలంగాణ జీఎస్డీపీ కంటే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 44 వేల కోట్లు ఎక్కువగా ఉంది. ఇక 2019 లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ 7.90 లక్షల కోట్లు కాగా, మూడేళ్లలో 2.94 లక్షల కోట్లు పెరిగింది. పెరుగుదల శాతం 37.28 శాతంగా నమోదయింది. వార్షిక వృద్ధి రేటు 12.42 శాతంగా ఉంది.
తలసరి ఆదాయం దేశంలో కంటే...
తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రెండు లక్షల రూపాయలకు చేరింది. 17.57 శాతం పెరుగుదల కన్పించింది. మూడేళ్లలో 33.34 శాతం పెరుగుదల కన్పించింది. 2021 - 2022 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,07, 771 లక్షలు కాగా, జాతీయ తలసరి ఆదాయం 1,50,707 లక్షలు మాత్రమేనని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తలసరి ఆదాయం అభివృద్ధి సూచికగా చూస్తారు.
Next Story