Thu Jan 16 2025 04:39:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మంత్రులుగా ఫరూక్, కిడారి
ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. గవర్నర్ నరసింహన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాలకు చెందిన ఎన్ఎండీ ఫరూక్ చేత తొలుత గవర్నర్ ప్రమాన స్వీకారం చేయించారు. తర్వాత ఇటీవల మావోయిస్టు దాడిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ చేత కూడా ప్రమాణ స్వీకార చేయించారు. ఇద్దరు సభ్యులకే మంత్రివర్గ విస్తరణ పరిమితమయింది. కిడారి శ్రావణ్ కుమార్ కు గిరిజన సంక్షేమ శాఖ, ఎన్ఎండీ ఫరూక్ కు వైద్య, ఆరోగ్య శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించనున్నారు.
Next Story