బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ రాష్ట్ర పతి భవన్ [more]
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ రాష్ట్ర పతి భవన్ [more]
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ రాష్ట్ర పతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వభూషణ్ హరిచందన్ జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. ఒడిశా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బిశ్వభూషణ్ హరిచందన్ పనిచేశారు. ఒడిశా న్యాయశాఖమంత్రిగా కూడ పనిచేశారు. ఇప్పటి వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్ గా ఈసీఎల్ నరసింహన్ దాదాపు పదేళ్ల పాటు పనిచేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించారు. ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా అనసూయ సుశ్రిని నియమించారు. తెలంగాణకు మాత్రం గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగుతారు.