ఆదాల కాంట్రాక్టు నే కాదనుకుని?
తాము రివర్స్ టెండరింగ్ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తాము ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు [more]
తాము రివర్స్ టెండరింగ్ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తాము ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు [more]
తాము రివర్స్ టెండరింగ్ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తాము ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. తమ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్టరుగా ఉన్న పనిని కూడా రివర్స్ టెండరింగ్ కు పిలిచామన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి 68 కోట్లు ఆదాయం అయిందని తెలిపారు. తమ ఎంపీ అయినా ఎలాంటి అనుకూలత చూపలేదని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు సోమశిల హైలెవల్ కెనాల్ కు సంబంధించి టెండర్లు పిలిచారన్నారు. తాము రివర్స్ టెండర్లకు వెళుతున్నందున ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని తెలిపారు.