Tue Dec 24 2024 16:31:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: మరో ఎమ్మెల్యే జంప్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిశాక ఈ మేరకు తన నిర్ణయం ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఉపేందర్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉపేందర్ రెడ్డితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.
Next Story