చివరి చూపు దక్కేనా….?
కచ్చులూరు బోటుప్రమాదంలో ఎంతో మంది గల్లంతయ్యారు. ఇవ్వాళ బోటు వెలికితీయడంతో గల్లంతైన వారి బంధువులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. గత నెలలో పాపికొండలు వీక్షించేందుకు బయలు దేరిన [more]
కచ్చులూరు బోటుప్రమాదంలో ఎంతో మంది గల్లంతయ్యారు. ఇవ్వాళ బోటు వెలికితీయడంతో గల్లంతైన వారి బంధువులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. గత నెలలో పాపికొండలు వీక్షించేందుకు బయలు దేరిన [more]
కచ్చులూరు బోటుప్రమాదంలో ఎంతో మంది గల్లంతయ్యారు. ఇవ్వాళ బోటు వెలికితీయడంతో గల్లంతైన వారి బంధువులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. గత నెలలో పాపికొండలు వీక్షించేందుకు బయలు దేరిన బోటు కచ్చులూరివద్ద మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 38 మంది ఆచూకీ లభించగా 12 మంది ఆచూకీ తెలియలేదు. ఇవ్వాళ బయటపడిన బోటులో ఇప్పటికి ఏడు మృతదేహాలను బోటులోనుంచి వెలికితీశారు. ఈ ఏడుగురు ఎవరు….? వారిని గుర్తించవచ్చాఅనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 38 రోజుల పాటు మృతదేహాలు నీళ్లల్లోనే ఉండడంతో మొత్తం ఉబ్బిపోయాయి. ఎక్కడికక్కడ చర్మం ఊడిపోయింది. జలచరాలు ఈ మృతదేహాలను పీక్కుతిన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వెలికితీసిన మృతదేహాలను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఈ మృతదేహాలను ఎవరికి సంబంధించినవో తెలియాలంటే డీఎన్ఏ పరీక్షలే చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇక బోటులో గల్లంతైన వారి కుటుంబసభ్యులు చివరి చూపైనా దక్కుతుందేమోనని రాజమండ్రికి వస్తున్నారు. మరో అయిదు మృతదేహాల మాటేమిటనేది అంతుచిక్కడం లేదు.