Mon Dec 23 2024 10:37:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జిందాల్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఖార్కివ్ పై రష్యా బలగాలు చేసిన ..
ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ (22) అనే విద్యార్థి ఉక్రెయిన్ లో మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. చందన్ జిందాల్ ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చనిపోలేదు. అతనికి ఇస్కీమిక్ స్ట్రోక్ అనే వ్యాధి ఉందని, ఆ వ్యాధి కారణంగానే చనిపోయినట్లు భారతీయ విదేశాంగ శాఖ వెల్లడించింది. జిందాల్ ఉక్రెయిన్ లోని విన్నిట్సియా నేషనల్ పై రోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్శిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు.
అనారోగ్యం కారణంగా జిందాల్ విన్నిట్సియాలోని అత్యవసర ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జిందాల్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఖార్కివ్ పై రష్యా బలగాలు చేసిన దాడిలో భారత్ కు చెందిన నవీన్ శేఖరప్ప అనే విద్యార్థి చనిపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్ లో మెడిసిన్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఇండియాలో మెడిసిన్ చదివించాలంటే కోట్లు ఖర్చవుతుందన్నారని, విదేశాలకు పంపితే.. అక్కడ ప్రాణాలే పోయాయంటూ నవీన్ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story