Fri Nov 22 2024 19:49:09 GMT+0000 (Coordinated Universal Time)
మరో కొత్త వైరస్.. ఇది డేంజరేనా?
చైనాలో మరో కొత్తరకం వైరస్ వెలుగు చూసింది. లాంగ్యా హెనిపా వైరస్ గా దీనిని గుర్తించారు.
చైనాలో మరో కొత్తరకం వైరస్ వెలుగు చూసింది. లాంగ్యా హెనిపా వైరస్ గా దీనిని గుర్తించారు. చైనాలో ఈ వైరస్ 35 మందికి సోకినట్లు వైద్యులు గుర్తించారు. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో ఈ వైరస్ వెలుగు చూసింది. లాంగ్యా హెనిపా వైరస్ ను లేవిగా కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ తో చైనా వాసులు భయపడిపోతున్నారు. చైనాలో మొదలయిన ఈ వైరస్ ఇతర దేశాలకు విస్తరించకుండా ఉండేందుకు అన్ని దేశాలు చర్యలు ప్రారంభించాయి.
ప్రాణాంతకం కాకున్నా....
ఈ లాంగ్యా హెనిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి తొలుత జ్వరం వస్తుందని అటున్నారు. దగ్గు, తలనొప్పి, వాంతులు వంటివి కూడా వస్తాయని చెప్పారు. ప్రస్తుతం చైనా తూర్పు ప్రాంతానికే పరిమితమైన ఈ వైరస్ దేశంలో ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధికి ప్రస్తుతం చికిత్స ఏమీ లేక పోవడంతో వైద్య రంగంలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమైనది కాదని చెబుతుండటం కొద్దిలో కొద్ది ఊరట కల్గించే అంశం.
Next Story