లాక్ డౌన్ సమయంలో కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని?
షేక్ పేట్ మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ వలలో [more]
షేక్ పేట్ మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ వలలో [more]
షేక్ పేట్ మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ వలలో ఆర్ఐ నాగార్జున, ఎస్సీ రవీందర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బంజారా హిల్స్ లో ఒకటిన్నర ఎకరాల స్థలం వివాదంలో ఈ ఇద్దరు టోటల్ అమౌంట్ కింద 15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సయ్యద్ అబ్దుల్ బంజారాహిల్స్ లో ఉన్న ఒకటిన్నర ఎకరాల స్థలం తనదే అంటూ కోర్టుకెక్కాడు. సయ్యద్ అబ్దుల్ తనదని చెప్పుకుంటున్న స్థలం రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ సాగుతుండటంతో ఈ సమయంలో ప్రభుత్వ బోర్డు ని తీసేసి ఆ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ స్వాధీనం చేసుకున్నాడు. స్థలం తనదే అంటూ రెవెన్యూ శాఖ తో వివాదం పెట్టుకోవడంతో రెవెన్యూ శాఖ సయ్యద్ అబ్దుల్ పై కేసు నమోదు చేసింది.
కోర్టును ఆశ్రయించి…
అయితే ఈ విషయంలో సయ్యద్ అబ్దుల్ కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు లో కేసు నడుస్తుంది. అయితే బాధితులు సయ్యద్ అబ్దుల్ ల్యాండ్ వద్దకు వెళ్లడంతో షేక్ పెట్ తహసిల్దార్ ఏప్రిల్ నెలలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తహసిల్దార్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు టోకెన్ అమౌంట్ గా పదిహేను లక్షల రూపాయలు షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.