బ్రేకింగ్ : కీలక బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దును మంత్రి బొత్స [more]
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దును మంత్రి బొత్స [more]
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు రెండింటీకీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినా బిల్లులను ఆమోదం లభించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించడం కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు బుగ్గన తెలిపారు.ప్రతి మూడు జిల్లాలకు ఒక జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి డెవెలెప్ మెంట్ అధారిటీ ఏర్పాటు చేస్తామని, అమరావతిలో లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కర్నూలులో జ్యుడిషియల్ ఏర్పాటు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రోపాలిటన్ అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ, కర్నూలు అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేయనున్నారు. రాజ్ భవన్ , సెక్రటేరియట్ విశాఖలోనే ఉండనుంది. న్యాయవ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు కర్నూలు లో ఏర్పాటు చేస్తామన్నారు.