అమరావతిపై నాకెలాంటి కోపం లేదు
కట్టని రాజధాని గురించి వెయ్యిరోజుల నుంచి కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
కట్టని రాజధాని గురించి వెయ్యిరోజుల నుంచి కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కట్టని రాజధాని, కట్టలేని రాజధాని గురించి ఉద్యమాలా? అని ఆయన ప్రశ్నించారు. 1956 నుంచి 2014 వరకూ చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదన్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ రాజధాని అని జగన్ ప్రభ్నించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ, ఓసీ కోసం ఈ రాజధాని కాదని, పెత్తందారుల కోసమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో ఎందుకు సంక్షేమ పథకాలు అమలు కాలేదని ప్రశ్నించారు. లక్షా అరవై ఐదు వేల కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు అందించామని జగన్ తెలిపారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు చంద్రబాబు ఆరోజు ఇవ్వలేదన్నారు. ఆరోజు జరిగిన దోపిడీ ఆయన అనుకూల మీడియా కూడా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు బృందం ఆలోచనలన్నీ మా బినామీ భూముల రాజధానిగానే ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని అన్నారు. పెత్తందారీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే పచ్చడి అమ్మినా, చిట్ఫండ్ వ్యాపారం చేసినా, డిపాజిట్ల సేకరణ చేసినా మావాడే చేయాలన్న మనస్తత్వం ఉంటుందని భావించే పెత్తందారీ వ్యవస్థలో మనం ఇన్నాళ్లు బతికామని చెప్పారు. నేను నా మనుషులు మాత్రమే ఉండాలని భావిస్తారు. అన్ని వ్యవస్థలూ తన మనుషుల చేతుల్లో ఉండాలని భావిస్తారన్నారు.