ఫొటో షూట్.. డ్రోన్ షాట్.. కందుకూరు ఘటనపై జగన్
ఫొటో షూట్ కోసం.. డ్రోన్ షాట్ కోసం చిన్న సందులో జనాన్ని నెట్టడంతోనే కందుకూరులో ఎనిమిది మంది మరణించారని జగన్ అన్నారు
ఫొటో షూట్ కోసం.. డ్రోన్ షాట్ కోసం చిన్న సందులో జనాన్ని నెట్టడంతోనే కందుకూరులో ఎనిమిది మంది మరణించారని జగన్ అన్నారు. వారిని చంపిన పాపం చంద్రబాబుదేనని అన్నారు. గతంలోనూ గోదావరి పుష్కరాల్లో షూట్ కోసం 29 మందిని పొట్టనపెట్టుకున్నారని జగన్ అన్నారు. మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించడానికి నానా తంటాలు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని వంచించిన ఈ బాబు సభలకు జనం ఎందుకు వస్తారని జగన్ ప్రశ్నించారు. అందరినీ మోసం చేసినందుకు సభలకు వస్తారా? అని ఎద్దేవా చేశారు. ఏం చేశారని రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు ఆయన సభలకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. నిజంగా మంచి చేసి ఉంటే ఎందుకు అధికారాన్ని దింపేశారని జగన్ ప్రశ్నించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చినందుకు విద్యార్థులు వస్తారా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టిందన్నారు. రాజకీయమంటే షూటింగ్ లు కాదని, డ్రోన షాట్ లు కాదని గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.