ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే…?
రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఎవరూ లాక్ డౌన్ సమయంలో బయటకు రావద్దని సూచించారు. కరోనాను [more]
రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఎవరూ లాక్ డౌన్ సమయంలో బయటకు రావద్దని సూచించారు. కరోనాను [more]
రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఎవరూ లాక్ డౌన్ సమయంలో బయటకు రావద్దని సూచించారు. కరోనాను కట్టడి చేయాలంటే స్వీయనియంత్రణే ముఖ్యమని గౌతం సవాంగ్ సూచించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారికి గౌతం సవాంత్ కొన్ని మార్గదర్శకాలు సూచించారు. పోలీసు శాఖ నుంచి అత్యవసర పనుల కోసం పాస్ లను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా పరిధిలో అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే జిల్లా ఎస్పీ నుంచి పాస్ లు తీసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే ఎస్పీ నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే డీజీపీ కార్యాలయం నుంచి పాస్ పొంద వచ్చునని తెలిపారు. ఇందుకోసం తగిన కారణాలు, ఆధారాలు చూపించాల్సి ఉంటుందన్నారు.