Mon Dec 23 2024 11:53:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: మూడు రాజధానులపై సుప్రీంకు జగన్ సర్కార్
మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.
మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గతంలో అమరావతి రాజధానిగానే కొనసాగాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని తెలిపింది. శాసన సభకు చట్టాలు లేదని హైకోర్టు తీర్పు చెప్పడం పై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
స్టే విధించాలంటూ....
రాజధాని అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పు సాధ్యం కాదని పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని పేర్కొంది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడింది. శాసనసభకు ఉన్న అధికారాలను హైకోర్టు ప్రశ్నించకూడదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. అమరావతి రాజధాని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని పిటీషన్ లో కోరింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు అధికార వికేంద్రీకరణపై చర్చ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
Next Story