ఆ ఐదు తప్ప ఇక అన్ని చోట్ల విక్రయాలు షురూ
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మే 4వ తేదీ నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో [more]
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మే 4వ తేదీ నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో [more]
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మే 4వ తేదీ నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఏపీలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఐదు జిల్లాలు మినహాయంచి మిగిలిన ఎనిమిది జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనే ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలు మాత్రం రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా పూర్తిగా గ్రీన్ జోన్ లో ఉంది. మిగిలిన ఏడు జిల్లాలు ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. ఇక్కడ మద్యం విక్రయాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నేడు ప్రకటన చేసే అవకాశముంది.