Free Bus in AP:మహిళలకు ఉచిత ప్రయాణం!
వచ్చేనెల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని జగన్ ప్రభుత్వం ఆనుకుంటోంది. తెలంగాణలోలా అన్ని వర్గాల స్త్రీలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అందించాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
AP Free Bus:వచ్చేనెల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని జగన్ ప్రభుత్వం ఆనుకుంటోంది. తెలంగాణలోలా అన్ని వర్గాల స్త్రీలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అందించాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని వెల్లడించనున్నారని పార్టీ వర్గాల నుంచి భోగట్టా. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో ఈ పథకం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహిళలంతా పల్లె వెలుగు, ఎక్సప్రెస్ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కూడా బస్సు ఫ్రీ సదుపాయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. అందుకే జగన్ ప్రభుత్వం ముందుగానే ఈ సౌకర్యాన్ని అమలు చేసి మార్కులు కొట్టేయాలని భావిస్తోంది.ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో స్త్రీలంతా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం... నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మీద పెను ప్రభావం చూపిస్తోంది.. అక్కడి క్యాబ్, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలే అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద ఉచిత బస్సు భారం మరింత తీవ్రంగా ఉండనుంది.చంద్రబాబు నాయుడు 'ఉచిత' హామీ ఇవ్వడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కూడా ఫ్రీ బస్సు విధానానికి అంగీకరించాల్సి వస్తోంది.