ఈ కేసు కూడా సీబీఐకి… ఏపీ హైకోర్టు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును సిబిఐకి అప్పగించింది.. ఏపీ హైకోర్టు పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును సిబిఐకి అప్పగించింది.. ఏపీ హైకోర్టు పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును సిబిఐకి అప్పగించింది.. ఏపీ హైకోర్టు పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కోర్టు జడ్జిల పైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు.. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సిఐడి విచారణ పైన ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.. జడ్జిల పైన పోస్టింగులు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారాని ప్రశ్నించింది.. అంతేకాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టాలు చెప్తున్నప్పటికీ సీఐడీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో వ్యాఖ్యానాలు కొన్ని పోస్టింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.