బ్రేకింగ్ : మరోసారి ఏపీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుల ఉపసంహరణపై జారీ చేసిన జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. పాత గుంటూరులో పోలీస్ [more]
ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుల ఉపసంహరణపై జారీ చేసిన జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. పాత గుంటూరులో పోలీస్ [more]
ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుల ఉపసంహరణపై జారీ చేసిన జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. పాత గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన కేసులో ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారించిన హైకోర్టు జీవోలో ముస్లిం యువత అని పేర్కొనడాన్ని తప్పు పట్టింది. ఆగ్రహం వ్కక్తం చేసింది. కేసుల ఉపసంహరణ జీవోపై ఎన్ఐఏను ఇంప్లీడ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని పిటీషనర్ కోరాగా, ఒక కమ్యునిటికి సంబంధించిన అంశం కాబట్టి ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.