శాసనమండలి మరో సారి వాయిదా
ఈరోజు ప్రారంభమయిన శాసనమండలి పదే పదే వాయిదా పడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూల్ 71 ప్రకారం చర్చ జరిపేందుకు ఛైర్మన్ సిద్ధపడటం, అందుకు మంత్రులు అభ్యంతరం [more]
ఈరోజు ప్రారంభమయిన శాసనమండలి పదే పదే వాయిదా పడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూల్ 71 ప్రకారం చర్చ జరిపేందుకు ఛైర్మన్ సిద్ధపడటం, అందుకు మంత్రులు అభ్యంతరం [more]
ఈరోజు ప్రారంభమయిన శాసనమండలి పదే పదే వాయిదా పడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూల్ 71 ప్రకారం చర్చ జరిపేందుకు ఛైర్మన్ సిద్ధపడటం, అందుకు మంత్రులు అభ్యంతరం చెబుతుండటంతో శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. బీజేపీ తో సహా మిగిలిన పార్టీలు బిల్లులను ప్రవేశపెట్టాలని కోరుతున్నా ఛైర్మన్ కు ఉన్న అభ్యంతరమేంటని బొత్స నిలదీశారు. ఈలోగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఛైర్మన్ షరీఫ్ చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోవడతో బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. టీడీపీ నేతలలు చెప్పినట్లు సభలో ఛైర్మన్ వ్యవహరించడం కాదని బొత్స అన్నారు. వైసీపీ సభ్యులు ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి మండలిని ఛైర్మన్ పదినిమిషాల పాటు వాయిదా వేశారు.