Thu Jan 09 2025 00:10:07 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మేకపాటి గౌతమ్ రాజకీయ అరంగేట్రం.. తొలిపోటీలోనే భారీ విజయం
వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు గౌతమ్ రెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆత్మకూరు
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం, బ్రాహ్మణ పల్లిలో 1971 నవంబర్ 2న మేకపాటి రాజమోహన్ రెడ్డి - మణిమంజరి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ (M.Sc) పట్టా పొందారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో వ్యాపార వేత్తగా ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు గౌతమ్ రెడ్డి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి.. 30,191 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలతోనే గౌతమ్ రెడ్డి అరంగేట్రం కాగా.. తొలి పోటీలోనే గెలుపొందడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండోసారి విజయం కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారంరోజుల క్రితం దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆయన నిన్నే తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురవ్వడం.. అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందడం వెంటవెంటనే జరిగిపోయాయి.
News Summary - AP Minister Mekapati Gautam Political Entry
Next Story