Tue Apr 08 2025 17:25:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబు తీరుకు నిరసనగా ఎమ్మెల్యే రాజీనామా

తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. తన నియోజకవర్గానికి, పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 15 రోజుల్లో హామీలను నెరవేర్చాలని లేకపోతే ముఖ్యమంత్రే రాజీనామా లేఖను స్పీకర్ కి పంపించాలని ఆయన పేర్కొన్నారు. 16వ రోజు నుంచి తాను హామీల సాధనకు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ శాసనసభ్యుడిని కానందుకే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని ఆయన ఆరోపించారు.
Next Story