Mon Dec 23 2024 14:21:42 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోనూ ఖజానా నిండింది.. మొత్తం ఖాళీ చేసేశారు !
ఏపీలో మద్యం ధరలు తగ్గడం, బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా. ఎవరి రేంజ్ కి తగ్గట్లు వారు.. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బేకరీలు, వైన్ షాపుల ముందు ప్రజలు బారులు తీరారు. పబ్ ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీజే లు, టపాసుల మోతలతో హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు పెడుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మందుబాబుల హడావిడితో ఖజానాలు నిండిపోయాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం దుకాణ దారులు భారీగా స్టాక్ దింపినప్పటికీ.. మందుబాబుల దెబ్బకు షాపుల ముందు నో స్టాక్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read : మద్యం మత్తుకు మరొకరు బలి
ఏపీలో మద్యం ధరలు తగ్గడం, బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. మొత్తం 1.36 లక్షల ఐఎంఎల్ లిక్కర్, 53 వేలకు పైగా బీర్ కేసులు తాగేశారట మందుబాబులు. సాధారణ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు రూ.70-75 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. డిసెంబర్ 31 రోజు రూ.124 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే ఈ ఒక్కరోజే.. రూ.50 కోట్ల మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. 30వ తేదీనే రూ. 121 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేయగా.. 30, 31వ తేదీల్లో రూ. 215 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసింది ఎక్సైజ్ శాఖ.. కానీ, సరఫరా చేసిన మొత్తం మద్యాన్ని ఖాళీ చేశారు మందుబాబులు.
Also Read : బంగార్రాజు టీజర్ విడుదల.. నాగార్జున - చైతన్య అదరగొట్టేశారుగా !
Next Story