Fri Nov 22 2024 14:22:04 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు జైలు శిక్ష
అరకు మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది
అరకు మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాను విధించింది. బెంగళూరు బ్యాంకింగ్ ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీస్ సెల్ కేసు నమోదు చేసింది. దోషిగా ఆమెను నిర్ధారించడంతో ఆమెను జైలుకు తరలించనున్నారు. కొత్తపల్లి గీత, ఆమె భర్త పీఆర్కే రావులు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి దాదాపు 42 కోట్ల రుణం తీసుకున్నారు. 2015లో ఈ కేసుకు సంబంధించి సీీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
బ్యాంకు రుణం కేసులో...
దీంతో సీబీఐ వీరిద్దరిపై కేసు నమోదు చేసింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా గీత భర్త ఉన్నారు. గతంలో చెక్ బౌన్స్ కూడా అయింది. దీనిపై కొత్తపల్లి గీత భర్తపై క్రిమినల్ కేసు కూడా నమోదయింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కొత్తపల్లి గీత ష్యూరిటీ ఇచ్చారు. ఎలాంటి మొత్తాన్ని చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు చేసిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.
Next Story