Mon Dec 23 2024 10:55:18 GMT+0000 (Coordinated Universal Time)
యార్కర్ తో ఇషాన్ కిషన్ ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్జున్ టెండూల్కర్
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్‌లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ బృందంలో ఉన్నా..
న్యూఢిల్లీ : అర్జున్ టెండూల్కర్.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడిగా పరిచయం అక్కర్లేని పేరు.. కానీ క్రికెట్ లో గొప్ప పేరైతే తెచ్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్‌లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ బృందంలో ఉన్నా.. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ అతను ఇప్పటికే చాలా దృష్టిని ఆకర్షించాడు. అర్జున్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు, ముంబై ఇండియన్స్ అర్జున్ ఫోటోను పోస్ట్ చేసింది. అతను తన మొదటి మ్యాచ్ ఆడతాడని అభిమానులు ఊహించారు. అయితే, అలా జరగలేదు.
ముంబై ఇండియన్స్ తాజా వీడియోలో, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వేయడం చూడవచ్చు. ఖచ్చితమైన యార్కర్‌ను అర్జున్ టెండూల్కర్ వేశాడు. ఇషాన్ కిషన్ డిఫెన్స్ ను దాటి.. వికెట్లను తాకింది. "You ain't missing if your name is Arjun," అని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో క్యాప్షన్‌గా ఉంచింది.
అర్జున్ టెండూల్కర్ ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌తో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఐపిఎల్ 2021 ఎడిషన్‌కు ముందు అతన్ని ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. అతను గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ IPLకి ముందు జరిగిన మెగా వేలంలో, అతన్ని మళ్లీ రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకుంది.
Next Story