Mon Dec 23 2024 12:38:29 GMT+0000 (Coordinated Universal Time)
పక్కా ప్లాన్.. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని?
ఆర్మీ అభ్యర్థులు పక్కా ప్లాన్ తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. నిన్ననే దీనిని ప్లాన్ చేశారు.
ఆర్మీ అభ్యర్థులు పక్కా ప్లాన్ తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. నిన్ననే దీనిని ప్లాన్ చేశారు. ఉత్తరాదిన అగ్నిపథ్ పై జరిగిన హింసను చూసి తాము కూడా ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పాస్ అయిన ఆర్మీ విద్యార్థులు రాత పరీక్ష కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేస్తున్నామని ఆర్మీ అధికారుల ప్రకటనతో వారు ఆగ్రహంతో ఉన్నారు.
నిన్న రాత్రి నుంచే...
తెలంగాణంలో దాదాపు 2,500 మంది ఆర్మీ అభ్యర్థులు ఉన్నారు. వీరంతా ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ కు రావాలని వారంతా ప్లాన్ చేసుకున్నారు. నిన్న రాత్రి చాలా మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఉదయాన్నే రైల్వే స్టేషన్ కు అన్ని ప్రాంతాల నుంచి ఆర్మీ అభ్యర్థులు చేరుకున్నారు. వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసుకుని తెలంగాణ నలుమూలల నుంచి ఆర్మీ అభ్యర్థులు వస్తున్నా ఇంటలిజెన్స్ పసిగట్ట లేకపోయింది.
నిరసన తెలపాలనుకున్నా....
వాళ్లంతా తొలుత రైళ్లు ఆపి తమ నిరసనను తెలియజేయాలని భావించారు. ఉదయం ఆరు గంటలకు చేరుకున్న ఆందోళనకారులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో ఒక్కసారిగా హింసకు దిగారు. అందిన వస్తువులను అందినట్లు చిందరవందరగా పడేశారు. దాదాపు రెండు గంటల పాటు రైల్వే స్టేషన్ లో విధ్వసం సృష్టించారు. లాఠీ ఛార్జి చేయకుండా ఉంటే శాంతియుతంగా నిరసనతెలిపి ఉండేవారమని వారు చెబుతున్నారు. కానీ వేలాది మంది ఉండటంతో ఆందోళన వారి చేతులను దాటిపోయింది. పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడింది. ఒకరి మృతికి కారణమయింది.
Next Story