Mon Dec 23 2024 09:13:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఉన్నతాధికారి?
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని ఊటీ కి సమీపంలోని కూనూరులో హెలికాప్టర్ కుప్పకూలింది.
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని ఊటీ కి సమీపంలోని కూనూరులో హెలికాప్టర్ కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. ఇందులో ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ హెలికాప్టర్ నుంచి ముగ్గురిని స్థానికులు రక్షించారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. హెలికాప్టర్ పూర్తిగా కాలి బూడిదయింది.
బిపిన్ రావత్....
తమిళనాడులోని కూనూరులో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. ఈ హెలికాప్టర్ కూలిన సమయంలో అందులో పథ్నాలుగు మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. సాంకేతిక కారాణాలా? లేదా కుట్రకోణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలిపోయిన హెలికాప్టర్ లో ఆరుగురు ఆర్మీ ముఖ్య అధికారులు ఉన్నట్లు తెలిసింది.
- Tags
- helicoptor
- army
Next Story