Tue Apr 08 2025 23:31:36 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ ఖాన్ కు అసద్ ‘బౌన్సర్’

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. మైనారిటీలకు భారతదేశంలో ఎంతో గౌరవం, అవకాశాలు ఉన్నాయని... మైనారిటీలపై భారత్ వ్యవహరిస్తున్న తీరును చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలని హితవు పలికారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ముస్లిం వ్యక్తి మాత్రమే ప్రధాని కాగలరని, కానీ భారత్ లో ఎవరికైనా ఈ అవకాశం ఉంటుందని అసద్ గుర్తు చేశారు. మైనారిటీల హక్కుల విషయంలో భారత్ ను చూసి పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలని అసద్ పేర్కొన్నారు. భారత్ లో మైనారిటీలను మిగతా వారితో సమానంగా చూడటం లేదని, మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Next Story