కేసీఆర్ కి గుడ్ న్యూస్ చెప్పిన అసద్
రాష్ట్రంలో హంగ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎంఐఎం వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చి ఆగిపోతే ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారనుంది. అయితే, ఎంఐఎం లేకపోతే టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కు మద్దతు విషయంలో ఎంఐఎం పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎటువైపు ఉంటుందనే ఊహాగానాలు రేగాయి. వీటికి ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చారు. తాము టీఆర్ఎస్ పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నట్లు ఓ ట్వీట్ చేశారు. దీనిని బట్టి టీఆర్ఎస్ కే ఎంఐఎం మద్దతు ఇవ్వడం ఖాయమని మరోసారి చెప్పారు. అయితే, ఎంఐఎం ప్రభుత్వంలో చేరుతుందా లేదా బయట నుంచి మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది.