Wed Dec 25 2024 01:04:31 GMT+0000 (Coordinated Universal Time)
పేదల ఆకలి పట్టదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ రాశారు. రేషన్ పంపిణీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంటింటికీ రేషన్ అంటూ ప్రజాపంపిణీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ రాశారు. రేషన్ పంపిణీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంటింటికీ రేషన్ అంటూ ప్రజాపంపిణీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ రాశారు. రేషన్ పంపిణీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంటింటికీ రేషన్ అంటూ ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేశారని అశోక్ బాబు ఆరోపించారు. రేషన్ డెలివరీ కోసం 769 కోట్లు ఖర్చు చేస్తున్నా అవి పేదలకు అందాలంటే గగనమయి పోయిందన్నారు. రేషన్ కోసం గంటల తరబడి రోడ్లపై నిలబెడుతున్నారని, నిరుద్యోగులను కూలీలుగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది డీలర్లు చనిపోయారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని అశోక్ బాబు కోరారు.
Next Story